బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ ఇప్పటివరకు 5 సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కు తారక్ హోస్ట్ చేయగా ఆ తర్వాత సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత కింగ్ నాగార్జున బిగ్ బాస్ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలోనూ సందడి చేసింది ఈ రియాలిటీ గేమ్ షో. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కు సిద్ధం అవుతుంది. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ సీజన్ లో అందాల యాంకర్ ఉదయ భాను కంటెస్టెంట్ గా పాల్గొననున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు ఉదయభాను(
Udaya Bhanu) స్టార్ యాంకర్ గా రాణించిన విషయం తెలిసిందే..
తన మాటలతో, చలాకీ తనంతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు ఉదయభాను. ఆ తర్వాత ఆమె యాంకరింగ్ కు దూరం అయ్యారు. ఇటీవల అడపాదడపా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేశారు ఉదయభాను. అయితే బిగ్ బాస్ సీజన్ 6 కు ఈ అమ్మడిని సంపాదించారని తాజా వార్త. ఇందుకోసం ఉదయభానుకు భారీ రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. అయితే ఉదయభాను మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. అయినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారట.