Sreeleela: లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈసారి యాక్షన్ సీన్స్‌లో ఇదరగదీయనుందట
తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది. ఇక ఈ చిన్నదాని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ లో ఈ బ్యూటీ దుమ్మురేపుతోంది. ఇక సెకండ్ సినిమా మాస్ రాజా నటించిన ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు నటసింహం బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
ఇటీవల టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయింది శ్రీలీల. ఈ అమ్మడి కోసం కుర్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. తమ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఉండాలని దర్శక నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారని టాక్. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది. ఇక ఈ చిన్నదాని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాన్స్ లో ఈ బ్యూటీ దుమ్మురేపుతోంది. ఇక సెకండ్ సినిమా మాస్ రాజా నటించిన ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు నటసింహం బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఫిలిం సర్కిల్ లో వినిపిస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల. ఈ సినిమాలో అమ్మడి పాత్ర బాలయ్య పాత్రకు సమానంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు నటన, డాన్స్ లతో ఆకట్టుకున్న శ్రీలీల ఇప్పుడు ఫైట్స్ తో అలరించనుందట.
బాలయ్య సినిమాలో శ్రీలీల బాక్సర్ గా కనిపించనుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా తీసుకుందట. అలాగే ఆమె ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లోనూ కనిపించనుందట. శ్రీలీల నాటు ఫైట్స్ చేస్తుందట ఈ మూవీలో.. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.