చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..! బిగ్ బాస్ హౌస్‌లోకి గ్లామర్ డాల్.. హౌస్‌లో రచ్చ రచ్చే

బుల్లితెర అడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ పూర్తికగా..ఇప్పుడు సీజన్ 9 రాబోతుంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ షో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ షోలోకి రాబోయే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ, టీవీ కళాకారులు పాల్గొననున్నట్లు సమాచారం.

చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..! బిగ్ బాస్ హౌస్‌లోకి గ్లామర్ డాల్.. హౌస్‌లో రచ్చ రచ్చే
Bigg Boss 9

Updated on: Jul 11, 2025 | 11:02 AM

బిగ్ బాస్ సీజన్ 9 కు సర్వం సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కి  కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

ఇది కూడా చదవండి : అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు సోషల్ మీడియాలో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న వయ్యారి భామ రీతూ చౌదరి. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయినా వారిలో రీతూ చౌదరి ఒకరు. ముందుగా సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది ఆతర్వాత జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యింది. అంతకు ముందు సింగర్ యశస్వికి స్టేజ్ పై హగ్ ఇచ్చి. లవ్ ప్రపోజల్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో గాలించారు కుర్రకారు.ఈ అమ్మడు జబర్దస్త్‌లో కొన్ని షోల్లో కనిపించింది. ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ మెరిసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ

గతంలో పలు సీరియల్స్ లో నటించింది రీతూ. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని స్కిట్స్ లో నవ్వులు పూయించింది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఈ హాట్ బ్యూటీ. ఇటీవల పలు వివాదాల్లోనూ ఇరుక్కుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. రీతూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం పక్క అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇది కూడా చదవండి :మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.