Rashmika Mandanna: ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఈ లక్కీ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుందా..?

|

Sep 19, 2022 | 8:09 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ తెస్తే మొదట కనిపించే పేరు రష్మిక మందన్న.ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.

Rashmika Mandanna: ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఈ లక్కీ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుందా..?
Rashmika Mandanna
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ తెస్తే మొదట కనిపించే పేరు రష్మిక మందన్న(Rashmika Mandanna)
.ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అయ్యింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. మహేష్ సరసన నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే తెలుగులో సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌లో తెగ వినిపిస్తోంది.

ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది రష్మిక. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అలాగే హిందీలో ఈ అమ్మడు నటించిన  గుడ్ బై సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ బిజీ బిజీగా ఉంది రష్మిక. అలాగే హిందీలో ఆషీకీ 3లో నటిస్తుందని ఇటీవలే టాక్ వచ్చింది. కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఈ మూవీకి అనురాగ్ బసు దర్శకుడు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో మూవీ ఒకటి. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు హరీష్. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేని కానీ రష్మిక ను కానీ ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.