Ye Maaya Chesave: త్వరలోనే ఏ మాయ చేసావే సీక్వెల్.. సమంత ప్లేస్ లోకి ఆ హీరోయిన్
ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అలాగే ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ఇద్దరు ప్రేమలో పడటం జరిగింది.
టాలీవుడ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏ మాయ చేసావే .. క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అలాగే ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ఇద్దరు ప్రేమలో పడటం జరిగింది. ఇక అప్పటివరకు వచ్చిన లవ్ స్టోరీలకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో నాగచైతన్య, సమంత నటించగా తమిళ్ వర్షన్ లో శింబు, త్రిష కలిసి నటించారు. ఇక ఈ సినిమా విడుదలైన ఇంతకాలానికి ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ గుర్తుంచి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి ఏ మాయ చేసావే సినిమా సీక్వెల్ తెరకెక్కించాలని గౌతమ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ సినిమా సీక్వెల్ గురించి ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గౌతమ్ మీనన్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నామని త్వరలోనే అది పూర్తవుతుందని అన్నారు. అయితే సమంత నాగచైతన్య విడిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమాలో సమంత నటించే ఛాన్స్ లేదు. దాంతో సామ్ ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారట.
అయితే ఈ సీక్వెల్ లో హీరో హీరోయిన్లు విడాకులు తీసుకున్నట్టు కథను సిద్ధం చేస్తున్నారట.. అలాగే సామ్ ప్లేస్ లోకి మరో హీరోయిన్ గా రష్మిక ను ఎంపిక చేశారని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రష్మిక ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.