
సినిమా ఇండస్ట్రీలో రామాయణానికి ఓ సపరేట్ స్థానం ఉంటుంది. ఇప్పటికే ఈ ఇతిహాసం నేపథ్యంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో అద్భుతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది మరేదో కాదు.. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ రాముడిగా రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సీతమ్మగా నేచురల్ స్టార్ సాయిపల్లవి నటిస్తుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అలాగే సహ నిర్మాతగాకన్నడ స్టార్ హీరో యష్ వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. రామాయణ సినిమా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి]. రీసెంట్ గా రామాయణ నుంచి ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రణబీర్, సాయి పల్లవి నటనతో పాటు రావణాసురిడిగా యష్ అదరగొట్టాడు. రావణాసురుడిగా యష్ అద్భుతంగా సెట్ అయ్యాడు. అలాగే ట్రైలర్ లో విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. అందరికి తెలిసిన కథే అయినప్పటికీ ఈ సినిమాలో ఎవరెవరు ఎలా నటించారు. విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అనేది చూడటానికి ప్రేక్షకులకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రామాయణ ట్రైలర్ లో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్ కనిపించారు.
వీరు కాకుండా మరో ఇద్దరూ స్టార్ హీరోలు కూడా ఈ ట్రైలర్ లో కనిపించారని టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నెట్టింట నెటిజన్స్ ఇందుకు సంబందించిన ఫోటోలను వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకూ నెటిజన్స్ చెప్పుకుంటున్న ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. రామాయణ ట్రైలర్ లో పరశురాముడిని గమనించారా.? రాముడికి ధనస్సు ఇచ్చే సన్నివేశంలో కనిపిస్తాడు. ఆయన పాత్ర కూడా రణబీర్ కపూరే నటించాడు. అంటే ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే ఓ సీన్ లో మహావిష్ణువును ఆకాశంలో చూపిస్తారు. అయితే ఆ రూపం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును పోలి ఉందంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా రామాయణలో మరో రణబీర్ , అలాగే మహేష్ బాబు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.