K.G.F: Chapter 2: కేజీఎఫ్ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరో యశ్ అన్ని భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. భారీ క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్1 పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను ఇప్పుడే ఎవరూ మరచిపోలేం. ఈ దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను మించేలా భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, హై టెక్నికల్ వేల్యూస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను రూపొందించారు మేకర్స్. కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే హోంబలే ఫిలింస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమానుంచి తుఫాన్ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’కి ప్రశాంత్ నీల్ దర్శకుడు. దాంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడని టాక్ నడుస్తుంది. ఇంతకు ముందు సలార్ మూవీ ఓపెనింగ్ కు యశ్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మరి కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :