Unstoppable with NBK2: బాలయ్య టాక్ షోకు ఆ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకానున్నారా..?

|

Sep 19, 2022 | 9:33 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ అటు హీరోగా ఇటు టాక్ షో హోస్ట్ గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకే బాలయ్య.

Unstoppable with NBK2: బాలయ్య టాక్ షోకు ఆ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకానున్నారా..?
Nbk
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ అటు హీరోగా ఇటు టాక్ షో హోస్ట్ గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకే బాలయ్య. ఆహా లో టెలికాస్ట్ అయ్యే అన్ స్టాపబుల్(Unstoppable with NBK) లో తన హోస్టింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసున్న ఈ సినిమా టాక్ షో.. త్వరలో సెకండ్ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. తనదైన స్టైల్ లో హోస్టింగ్ చేస్తూ గెస్ట్ లను ఆటపట్టిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ టాక్‌షోకు విపరీతమైన క్రేజ్‌ దక్కింది. ఓటీటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక టాక్‌ షోకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక టీఆర్‌పీ దక్కించుకుందీ షో. బాలకృష్ణ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లతో షో ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఇలా ఈ టాక్‌ షో తొలి సీజన్‌ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిర్వాహకులు ప్రస్తుతం సీజన్‌2 మొదలు పెట్టడానికిరెడీ అయ్యారు.

ఇటీవలే అన్ స్టాపబుల్ 2 త్వరలో రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టాక్ షోకు ఎవ్వరు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గత సీజన్ లో మహేష్ , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు వచ్చి సందడి చేశారు. ఇక ఇప్పుడు సీజన్ 2లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరికొంతమంది హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాలయ్య షోకు, ప్రభాస్, తారక్ కూడా హాజరుకానున్నారని అంటున్నారు. బాలయ్య షోకు నిజంగా ప్రభాస్, తారక్ వస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.