మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.?
అందాల భామ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే.

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల భామ. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. సీతారామం సినిమా వెంటనే నాని తో కలిసి హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
నానితో చేసిన హాట్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ లక్కీ చార్మ్ గా మారిపోయింది ఈ భామ. కానీ ఆ వెంటనే విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మృణాల్ స్పీడ్ కు బ్రేక్ పడింది. దాంతో సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని కల్కి సినిమాలో చిన్న రోల్ చేసింది. ఇక ఇప్పుడు డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో మృణాల్ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.
కోలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో శింబు సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుందని తెలుస్తుంది. శింబు సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది మృణాల్.. మృణాల్ కోలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో శింబు ఓ సినిమా చేస్తున్నాడని ఆ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
