AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: తారక్ సినిమా కోసం హీరోయిన్స్ వేట.. ఆ అమ్మడు ఆల్మోస్ట్ కన్ఫామ్ అంటున్నారే

కొమురం భీంగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు తారక్. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Jr NTR: తారక్ సినిమా కోసం హీరోయిన్స్ వేట.. ఆ అమ్మడు ఆల్మోస్ట్ కన్ఫామ్ అంటున్నారే
Ntr
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2022 | 8:51 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం నందమూరి అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు తారక్. కొమురం భీంగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు తారక్. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కొరటాల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు తారక్ సినిమాకోసం కాస్త గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు కొరటాల.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన వీడియ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను మెప్పించింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని ఈ గ్లిమ్ప్స్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి రోజుకొక వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని ఎంపిక చేశారని టాక్ వినిపించింది. అందాల భామ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత నేషనల్ క్రాష్ రష్మిక మందన్న తారక్ సరసన ఛాన్స్ దక్కించుకుందని అన్నారు. ఇక ఇప్పుడు మరో బ్యూటీ పేరు వినిపిస్తోంది.

తారక్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని అంటున్నారు. ఇటీవలే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ అందుకుంది కీర్తి. ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచి అలరించింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీని తారక్ సినిమాకోసం ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?