
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ అంత పెద్ద హిట్ అందుకోలేకాదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జైలర్ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాయూ ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఓ టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నారని తెలుస్తుంది.
జైలర్ సినిమాలో కొంతమంది హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ జైలర్ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు జైలర్ 2లో కూడా కొంతమంది హీరోలు గెస్ట్ లుగా కనిపిస్తారని తెలుస్తుంది. కాగా జైలర్ 2 సినిమాలో స్పెషల్ రోల్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా కనిపిస్తారని అంటున్నారు. గతంలో జైలర్ సినిమాకు కూడా నెల్సన్ బాలయ్యను గెస్ట్ రోల్ లో నటించమని అడిగారని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు జైలర్ 2లో బాలయ్య కనిపించనున్నారని అంటున్నారు.
జైలర్ 2లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని అంటున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా అయ్యాయని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా జైలర్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జైలర్ 2 టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో జైలర్ సినిమాకు మించి యాక్షన్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక బాలకృష్ణ రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2 సినిమా చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి