AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAILER 2 : జైలర్ 2లో నటసింహం.. రజినీకాంత్ సినిమాలో ఆ పాత్రలో కనిపించనున్న బాలయ్య..!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు.

JAILER 2 : జైలర్ 2లో నటసింహం.. రజినీకాంత్ సినిమాలో ఆ పాత్రలో కనిపించనున్న బాలయ్య..!
Balakrishn, Rajinikanth
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2025 | 7:17 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ అంత పెద్ద హిట్ అందుకోలేకాదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జైలర్ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాయూ ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఓ టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

జైలర్ సినిమాలో కొంతమంది హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ జైలర్ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు జైలర్ 2లో కూడా కొంతమంది హీరోలు గెస్ట్ లుగా కనిపిస్తారని తెలుస్తుంది. కాగా జైలర్ 2 సినిమాలో స్పెషల్ రోల్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా కనిపిస్తారని అంటున్నారు. గతంలో జైలర్ సినిమాకు కూడా నెల్సన్ బాలయ్యను గెస్ట్ రోల్ లో నటించమని అడిగారని వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు జైలర్ 2లో బాలయ్య కనిపించనున్నారని అంటున్నారు.

ఇది కూడా చదవండి :నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

జైలర్ 2లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని అంటున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా అయ్యాయని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా జైలర్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా జైలర్ 2 టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో జైలర్ సినిమాకు మించి యాక్షన్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక బాలకృష్ణ రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2 సినిమా చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..