AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్‌కు జోడీగా మరోసారి సమంత.. ఆ సినిమా కోసమేనా..

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై డజన్ల కొద్దీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు 'పుష్ప 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప 2 గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి.

Allu Arjun: అల్లు అర్జున్‌కు జోడీగా మరోసారి సమంత.. ఆ సినిమా కోసమేనా..
Allu Arjun Samantha
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2024 | 9:05 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే..బన్నీ ఇప్పుడు అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లపై డజన్ల కొద్దీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప 2 గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది.

అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇటీవకే అట్లీ జవాన్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.. జవాన్ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారని టాక్. అట్లీ, అల్లు అర్జున్‌ల సినిమా ‘ఏఏఏ’ అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానికి టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది బన్నీకి విషెస్ తెలిపారు.

సమంత కూడా అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపింది. దాంతో మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇక్కడ, మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. దర్శకుడు అట్లీ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సమంత పేరు వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే ‘తేరి’ సినిమాలో అట్లీ, సమంత కలిసి పనిచేశారు. బాలీవుడ్‌లో అట్లీ చేసిన ‘జవాన్‌’లో సమంత కథానాయికగా నటిస్తుందని పుకార్లు వినిపించాయి. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో సమంత పేరు వినిపిస్తోంది. టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే దీని పై కూడా క్లారిటీ అవకాశం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?