
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఈ మధ్యకాలంలో పెద్ద హిట్ కొట్టిందే లేదు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇక ఇటీవలే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య డిఫరెంట్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.
సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మత్యకారుల జీవిత కథతో తెరకెక్కుతోన్న ఈసినిమాను యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు చందు. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య నాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా ఇది.
తండేల్ సినిమాకు దేవినే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటించనున్నారని తెలుస్తోంది. తండేల్ సినిమాలో అమల ఓ చిన్న పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తుంది. కింగ్ నాగార్జున సతీమణి అమల ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆతర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ఆతర్వాత లైఫ్ ఈస్ బ్యూటీఫుల్, ఒకే ఒక జీవితం సినిమాలో నటించారు అమల. ఇక ఇప్పుడు నాగచైతన్య తండేల్ సినిమాలోనూ నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. చాలా మంది ఇది ఉత్త రుమ్మర్ అని కొట్టిపడేస్తున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..