
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ రిటైర్మెంట్ ప్రకటించటంతో కోలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిఫరెంట్ సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో విజయ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ టాప్ చైర్ లోనే ఉన్నా… వాళ్లు సీనియర్స్ అన్న ట్యాగ్ తో సైడ్ అయ్యారు. దీంతో విజయ్, అజిత్ మధ్యే ఇన్నాళ్లు టఫ్ ఫైట్ నడిచింది. ఈ ఫైట్‌లో విజయ్ ఒక్క అడుగు ముందున్నట్టుగా కనిపించింది.
కానీ పొలిటికల్ ఎంట్రీ తరువాత విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నా అంటూ ప్రకటించటంతో సీన్ మారిపోయింది. విజయ్ సైడ్ అయితే నెక్ట్స్ ఆ జోన్ లో ఉన్న అజిత్ నెంబర్ అవుతారని అంతా భావించారు. కానీ అజిత్ కూడా సినిమాల విషయంలో పెద్దగా ఇంట్రస్ట్ లేదని తేల్చేశారు. ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా రేస్ ట్రాక్ ల మీదే కనిపిస్తున్న తల.. రేసింగ్ మధ్యలో గ్యాప్ ఉంటేనే సినిమాలు చేస్తా అంటున్నారు. దీంతో అజిత్ కూడా నెంబర్ వన్ రేసులో లేరని తేలిపోయింది.
రజనీకాంత్, కమల్ హసస్ యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా… ప్రజెంట్ వాళ్లను నెంబర్ రేసులోకి తీసుకునే అవకాశం లేదు. ఆల్రెడీ ఆ ప్లేస్ లో దశాబ్దాల పాటు రూల్ చేసి యంగ్ జనరేషన్ కు అప్పగించారు రజనీ, కమల్. ఇప్పుడు విజయ్, అజత్ కూడా సైడ్ అవ్వటంతో నెక్ట్స్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. సూర్య, విక్రమ్ లాంటి హీరోలు వరుస సినిమాలతో అలరిస్తున్నా… వాళ్ల సక్సెస్ రేటు కారణంగా వాళ్ల పేర్లు నెంబర్ రేసులో కనిపించటం లేదు. ఈ ఏడాది రాబోయే సినిమాలతో ఈ ఇద్దరు ఫామ్‌లోకి వస్తే మళ్లీ నెంబర్ గేమ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న సూర్య, కోవిడ్ టైమ్‌లో డిజటల్ రిలీజ్‌లతో సత్తా చాటారు. ఆ తరువాత థియెట్రికల్‌గానూ అదే రేంజ్‌లో జోరు చూపిస్తారని భావించినా… కుదరలేదు. లేటెస్ట్ రిలీజ్ కంగువా డిజాస్టర్ కావటంతో మరోసారి ఆలోచనలో పడ్డారు తమిళ జనాలు. ఇక విక్రమ్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. విక్రమ్ సక్సెస్ చూసి చాలా కాలం అవుతుంది. వరుసగా ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నారు. శివకార్తికేయన్ లాంటి హీరోలు మంచి సక్సెస్ లు సాధిస్తున్నా… ఇప్పుడే నెంబర్ వన్ హీరో అన్న రేంజ్ ట్యాగ్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కొంత కాలం కోలీవుడ్ లో నెంబర్ వన్ చైర్ ఖాళీయే అంటున్నారు విశ్లేషకులు.