Baahubali: ‘బాహుబలి’ సినిమాలో రానా భార్య ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు బయటపడిన నిజం
బాహుబలి.. తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

తెలుగు సినిమా ఘనతను దేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. ఇంకా నిజం చెప్పాలంటే మన దేశంలో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిందే ఈ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రాగా రెండూ బాక్సాఫీస్ ను రఫ్పాడించాయి. అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచాయి. ఈ సినిమాలో మనకు చాలా పాత్రలు కనిపించాయి. అలాగే ఎందరో స్టార్స్ కనిపిస్తారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ, సత్య రాజ్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, అడివి శేష్, ప్రభాకర్, సుదీప్, చలపతి రావు, జాన్ కొక్కెన్, చివరికి రాజమౌళి కూడా ఓ పాత్రలో తళుక్కుమంటారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియాలో లెవెల్ లో అతనికి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత బాగా హైలెట్ అయ్యింది రానా దగ్గుబాటి పోషించిన భళ్లాల దేవ పాత్రనే. అప్పటివరకు హీరోగా సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయ్యాడు రానా. భళ్లాల దేవుడిగా విలన్ పాత్రలో అద్భుతంగా నటించి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
కాగా బాహుబలి సినిమా వచ్చి సుమారు 11 ఏళ్లు అవుతోంది. అయితే అందరి మదిలో ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమాను చూస్తున్నప్పుడు చాలా మందికి ఈ ప్రశ్న మదిలో మెదులుతుంది. అదే భళ్లాల దేవుడి భార్య ఎవరు? అనుష్కపై మనసు పడిన రానా ఆమెను ఎలా హింసించాడో సినిమాలో చూపించారు. అయితే అతని భార్య ను మాత్రం చూపించలేదు. ఇదే విషయంపై ఓ షోలో అడివి శేష్ స్పందించాడు. బాహుబలిలో అతను కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. భళ్లాలదేవుడు కొడుకుగా నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో బాహుబలి సినిమాలో భద్రకు తల్లి, భళ్లాల దేవుడి భార్య ఎవరు అని ఓ టాక్ షోలో అడగ్గా దానికి అడివి శేష్ ఇలా సమాధానమిచ్చాడు. ‘నేను కూడా రాజమౌళిని ఈ ప్రశ్న అడిగాను. దానికి ఆయన ‘ భళ్లాల దేవుడి పాత్ర ఒక దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడు ఎవర్నైనా ఏదైనా చేసుంటాడు.. అలా నువ్వు పుట్టావ్’ అని చెప్పినట్లు వెల్లడించాడు. అయితే ఇక్కడ కూడా రానా భార్య ఎవరో క్లారిటీగా చెప్పకపోయినా కనీసం భద్ర ఎలా పుట్టాడు అనే విషయం అయినా తెలిసిందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




