AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 90’sలో సూపర్ స్టార్.. బ్రెయిన్ స్ట్రోక్‏తో కెరీర్ నాశనం.. కడుపు నింపుకోవడానికి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న హీరో..

ఒకప్పుడు యావత్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో. ముఖ్యంగా 90'sలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కెరీర్ పూర్తిగా నాశనమైంది. దీంతో తన కడుపు నింపుకోవడానికి అలాగే కుటుంబాన్ని పోషించుకోవడానికి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేసినట్లు వెల్లడించారు.

Tollywood : 90'sలో సూపర్ స్టార్.. బ్రెయిన్ స్ట్రోక్‏తో కెరీర్ నాశనం.. కడుపు నింపుకోవడానికి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న హీరో..
Rahul Roy
Rajitha Chanti
|

Updated on: Sep 09, 2026 | 11:33 AM

Share

90వ దశకంలో లక్షలాది మంది అభిమానులను పిచ్చెక్కించిన హీరో. రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అతడు మరెవరో కాదు ‘ఆషిఖీ’ ఫేమ్ నటుడు రాహుల్ రాయ్. ప్రస్తుతం మరో కారణంతో వార్తల్లో నిలిచారు. తన రూపం, హెయిర్‌స్టైల్‌తో యావత్ దేశాన్ని అబ్బురపరిచి, ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ట్రోఫీని గెలుచుకున్న ఈ నటుడు, ఇప్పుడు తన జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకున్నారు. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఆయన, ఈనాడు తన కడుపు నింపుకోవడానికి, వైద్య ఖర్చులు భరించడానికి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాహుల్ రాయ్ తన జీవితంలోని ఈ కష్ట కాలాన్ని అందరితో పంచుకున్నారు. 2020లో కార్గిల్‌లో ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ఆ ప్రాణాంతకమైన అనారోగ్యం నుండి ఎలాగోలా బయటపడ్డారు, కానీ ఆ తర్వాత సినీ పరిశ్రమలో అవకాశాలు దూరమయ్యాయి.

“గత ఐదేళ్లుగా నేను అనారోగ్యం నుంచి కోలుకుని, నా శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికే ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాకు ఎలాంటి పని లేదు. ఒకవేళ నాకు ఈ ప్రమాదం జరగకపోయి ఉంటే, ఈ రోజు నేను చాలా పనులు చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడటంతో, నేను తిరిగి కెమెరా ముందుకు వచ్చాను.నెమ్మదిగా పని చేయడం ప్రారంభిస్తున్నాను” అని రాహుల్ అన్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత, రాహుల్ జీవనోపాధి సంపాదించుకోవడం అనే తీవ్రమైన సమస్యను ఎదుర్కొన్నాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాహుల్ ఏమాత్రం సంకోచం లేకుండా తనకు దొరికిన ఏ పనినైనా చేశాడు. “నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత, సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేను బతకాలి, అలాగే మందులు, ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాలి. అందుకే కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు చేతనైనదంతా చేశాను. నేను తరచుగా పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్స్ చేస్తుంటాను. ఆ ఒక్క ప్రదర్శన నుంచి నాకు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలు వస్తాయి, ఆ డబ్బుతో నా నెల రోజుల ఖర్చులు తీరిపోతాయి” అని అన్నారు.

పెళ్లిళ్లలో ఆయన డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో చాలా మంది ఆయనను చాలా విమర్శించారు. దీనికి రాహుల్ రాయ్ చాలా ప్రశాంతంగా స్పందించారు. “ఇంట్లో ఏసీలో కూర్చుని నన్ను ట్రోల్ చేసే వాళ్లకు, ఈ పరిస్థితుల్లో నిలబడి డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో తెలియదు. నేను కూడా కడుపు నింపుకోవాలి. నేను ఎవరి ముందు చేతులు చాచడం లేదు, నా సొంత కష్టంతో డబ్బు సంపాదిస్తున్నాను,” అని అన్నాడు. ప్రస్తుతం రాహుల్ రాయ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

రాహుల్ రాయ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us