మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలకు ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తులకు సౌకర్యాల కల్పన, ఆలయ అభివృద్ధి, దసరా నవరాత్రుల నిర్వహణలో ఆమె సూచనలు చేయనున్నారు.