
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, కబాలి హీరోయిన్ సాయి ధన్సికలు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన జరిగిన ఓ సినిమా ఈవెంట్ లో తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్. హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సికను తన ప్రేయసిగా పరిచయం చేశాడు. ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నామంటూ వెడ్డింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో విశాల్ అభిమానులు కూడా తెగ సంతోష పడ్డారు. అయితే కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది. అయితే ఇంతకు ముందు ప్రకటించిన వెడ్డింగ్ డేట్ నే ఎంగేజ్ మెంట్ డేట్ గా మార్చుకున్నారు విశాల్- సాయి ధన్సిక. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (ఆగస్టు 29)
తన ప్రేయసితో ఉంగరాలు మార్చుకున్నాడు విశాల్. చెన్నైలో గ్రాండ్ గా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విశాల్, సాయి ధన్సిక కలిసి ఒక్క సినిమా చేయలేదు.. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందోనని తెలుసుకునేందుకు నెటిజన్లు తహతహలాడుతున్నారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. 1977 ఆగస్టు 29న జన్మించిన విశాల్ కు నిన్నటితో 48 ఏళ్లు నిండాయి. ఇక సాయి ధన్సిక 1989 సెప్టెంబర్ 20న జన్మించింది. అంటే ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య దాదాపు 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ కంటే సాయి ధన్సిక అంత చిన్నదా అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. ప్రేమకు వయసుతో పనేముంది అంటూ మరికొందరు స్పందిస్త్ఉన్నారు.
Thank u all u darlings from every nook and corner of this universe for wishing and blessing me on my special birthday. Happy to share the good news of my #engagement that happend today with @SaiDhanshika amidst our families.feeling positive and blessed. Seeking your blessings and… pic.twitter.com/N417OT11Um
— Vishal (@VishalKOfficial) August 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.