టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ వార్త అఫిషియల్‌గా వచ్చేసింది. వరుణ్‌తేజ్ స్వగృహంలో కుటుంబసభ్యుల సమక్షంలో శుక్రవారం వీరి నిశ్చితార్థం ఆత్మీయంగా జరగనుంది. త్వరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టనున్నారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. మిస్టర్ సమయంలోనే ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలైంది. అంతరిక్షం సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే దాని గురించి అటు వరుణ్‌గానీ, ఇటు లావణ్యగానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు నిశ్చితార్థవార్తల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఇటీవలే నటుడు శర్వానంద్ ఓ ఇంటివాడయ్యారు. రాజస్థాన్ జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రక్షిత మెడలో మూడుముళ్లు వేశారు శర్వానంద్. రెండు రోజుల పెళ్లి ఘనంగా జరిగింది. అత్యంత ఆత్మీయులు, బంధువులు పెళ్లికి హజరయ్యారు. జైపూర్ నుంచి హైదరాబాద్‌కి చేరుకున్నారు నూతన వధూవరులు శర్వానంద్, రక్షిత. వీరి వివాహ రిసెప్షన్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పలువురు హాజరుకానున్నారు.
అటు కన్నడ నాట కూడా సుమలత ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. దివంగత నటుడు అంబరీష్, నటి సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్ వివాహం వైభవంగా జరిగింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బుధవారం జరిగిన రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న అభిషేక్ – అవివా ఒకింటివారైన సందర్భంగా సన్నిహితులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.