OTT Movie : దైర్యముంటేనే చూడాల్సిన సినిమా.. రియల్ స్టోరీ.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే..

|

Sep 29, 2024 | 6:49 PM

ఓటీటీల్లో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ జోనర్స్‌లో సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అలాగే ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా తెగ హల్ చల్ చేస్తోంది.

OTT Movie : దైర్యముంటేనే చూడాల్సిన సినిమా.. రియల్ స్టోరీ.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే..
Horror Movie
Follow us on

ఓటీటీలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కొత్త సినిమాలను థియేటర్స్ లో చూసి ఆ తర్వాత ఓటీటీల్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అతృతతో ఉంటారు. అలాగే థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఉంటారు. ఇక ఓటీటీల్లో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ జోనర్స్‌లో సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అలాగే ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా తెగ హల్ చల్ చేస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు చూడకవటమే మంచిది. ఇంతకూ ఈ సినిమా ఏంది.? ఎక్కడ చూడొచ్చు అంటే..

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

ఇక ఈ హారర్ సినిమాను రియల్ స్టోరీతో తెరకెక్కించారు. ఈ సినిమా దెయ్యాలను పట్టుకునే ఓ జంట నేపథ్యంలో జరుగుతుంది. ఈ సినిమాను నిజజీవిత కథ ఆధారంగా రాసిన ఓ నవల నుంచి తీసుకొని సినిమాగా చేశారు. ఈ చిత్రం ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని దెయ్యాల నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సినిమాలో ఓ పెద్ద బంగ్లా ఉంటుంది. అందులో ఓ ఫ్యామిలీ జీవిస్తూ ఉంటుంది. అయితే ఆ బంగ్లా పక్కన ఉన్న ఓ తోటలో చెరువు ఉంటుంది. అక్కడ కొన్ని ఎండిన చెట్లు కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ఆ చెట్టు దగ్గర ఎదో దుష్టశక్తి ఉందని తెలుసుకుంటుంది ఆ ఫ్యామిలీ. దాంతో దెయ్యాలను పట్టుకునే ఆ జంటను పిలిపిస్తారు. ఆ జంట ఇంటిని సందర్శిస్తారు. అప్పుడు వారు ఆ కుటుంబానికి సహాయం చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఆతర్వాత ఏం జరిగింది.? ఆ కుటుంబాన్ని ఎలా కాపాడారు.? ఆ దెయ్యాన్ని పట్టుకున్నారా లేదా.? అనేది ఈ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా 2013లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే.. ది కంజురింగ్. ఈ సినిమా చివరిలో వాస్తవ సంఘటన సంబందించిన ఫోటోలు చూపించారు. అలాగే ఈ సినిమా మూడు పార్ట్స్‌గా విడుదలైంది. అలాగే నాలుగో పార్ట్ ‘ది కంజురింగ్: ది లాస్ట్ రైట్స్’ 2025లో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.