Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గాయాలు.. అసలు విషయం ఏంటంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కూలి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ తో పాటు మరికొంతమంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. అక్కినేనినాగార్జున , ఉపేంద్ర ఇలా పలువురు ఈ సినిమాలో కనిపించనున్నారు.

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గాయాలు.. అసలు విషయం ఏంటంటే..
Rajinikanth

Updated on: Jul 30, 2025 | 4:04 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పాన్ ఇండియా సినిమాలకు రాక ముందే రజినీ కాంత్ సినిమాలు విదేశాల్లోనూ విడుదలై నయా రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ రజినీకాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో సూపర్ స్టార్ కు భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ రజినీకాంత్ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే జైలర్, వెట్టాయన్ సినిమాలతో హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ ఇప్పుడు  కూలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

ఈ వీడియోలో రజినీకాంత్ కాలు జారీ పడటం మనం చూడోచ్చు.. ఇంట్లో వాకింగ్ చేస్తున్న రజినీకాంత్ ఒక్కసారిగా కాలు స్లిప్ అవ్వడంతో కింద పడిపోయారు అయితే ఇది రజినీకాంత్ వీడియో కాదు అని తెలుస్తుంది. ఆ వీడియోలో ఉన్నది రజినీకాంత్ కాదు అని సమాచారం… కొంతమంది ఆ వీడియోలో ఉన్నది రజినీకాంత్ అని సోషల్ మీడియాలో ఆ క్లిప్ ను వైరల్ చేస్తున్నారు. వైరల్ గా మారిన ఆ వీడియోలో వ్యక్తి అచ్చం రజినీకాంత్ లానే ఉన్నారు. కానీ అది రజినీకాంత్ కాదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో కొంతమంది అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జాగ్రత్తగా ఉండండి సార్..! అని కామెంట్స్ చేస్తుంటే మారికొందరు. ఆ వీడియోలో ఉన్నది రజినీకాంత్ కాదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఉపేంద్ర తో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి