
బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి వితికా షెరు ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆమె చెల్లెలు కృతికా తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుని మురిసిపోయారు అక్కాచెల్లెళ్లు. ముఖ్యంగా తాను పెద్దమ్మగా ప్రమోషన్ పొందానంటూ వితిక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వితికతో పాటు ఆమె చెల్లెలికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చెల్లి అయినప్పటికీ కృతికను చంటిపాపలా చూసుకుంది వితిక. దగ్గరుండి మరీ ఆమెకు పెళ్లి చేసింది. ఇక ఆమె గర్భం ధరించినప్పటి నుంచి చెల్లి వెంటే ఉంటోంది. సీమంతం ఇతర కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకుంది. ఇప్పుడు తన చిట్టి చెల్లికి బాబు పుట్టడంతో వితిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా 2022లో కృతిక, కృష్ణల వివాహం జరిగింది.
ఇదిలా ఉంటే వరుణ్ సందేశ్, వితికా షెరులది చూడముచ్చటైన జంట. అయితే పెళ్లయి పదేళ్లు అవుతున్న వీరికి ఇంకా పిల్లలు లేరు. వరుణ్ సందేశ్- వితిక లది ప్రేమ వివాహం. పడ్డానంటి ప్రేమలో మరి సినిమా షూటింగ్ లో వీరి పరిచయం మొదలైంది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఆపై ప్రేమగా చిగురించింది. పెద్దల అనుమతితో 2016లో పెళ్లిపీటలెక్కారు వరుణ్ సందేశ్ – వితిక. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2018లో వితిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుని మురిసిపోయింది. కానీ ఆమెను దురదృష్టం వెంటాడింది. అనారోగ్య కారణాలతో ఆమెకు అబార్షన్ అయ్యింది. ఆ తర్వాత కూడా వితిక కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వరుణ్. అయితే త్వరలోనే తాము కూడా గుడ్ న్యూస్ చెబుతామని, పిల్లల కోసం ప్లానింగ్ చేస్తున్నామని వరుణ్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.