డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. సూప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. సంయుక్త మీనన్ కలిసి నటించిన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అంతేకాకుండా.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సెన్సెషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యాడు తేజ్. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేసిన మేకర్స్.. సినిమాతో ఆడియన్స్ అంచనాలను దాటేశారు. ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లింగ్ గురి చేసింది ఈ చిత్రం. ఇక మొదటి రోజు ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమాకు ఫస్ట్ కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది.
మార్నింగ్ ఫస్ట్ షో స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మాట్నీస్ నుంచి అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ఆదరణ పెరిగిపోయింది. సాయంత్రం వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం కిక్కిరిసిపోయాయి. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం 7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందట. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. మొదటివారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
ఈ చిత్రంలో తేజ్ సరసన సంయుక్త కథానాయికగా నటించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తెలుగు చిత్రపరిశ్రమలో బిజీ హీరోయిన్ గా ఈ బ్యూటీకి విరూపాక్ష మూవీతో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్తకు మరిన్ని అవకాశాలు రావడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.