మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాటపర్వం(Virata Parvam) సినిమా మరి కొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా(Rana), సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా నటించగా అతడి భావజాలాలు , రచనలను ఇష్టపడే వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియాట్ అయ్యింది. రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్ ఈ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక ట్రైలర్స్ తో ఆ అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు విరాటపర్వం టీమ్. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రే ప్రధానంగా ఉంటుందని మొదటి నుంచి చిత్రయూనిట్ చెప్తూ వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ద బర్త్ ఆఫ్ వెన్నెల అని హీరోయిన్ పాత్రకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
నక్సల్స్ నేపథ్యంలో సాగే సీరియస్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అందమైన ప్రేమ కథను జోడించారు దర్శకుడు వేణు ఊడుగుల. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే గ్లిమ్ప్స్ లో ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది..నేను వెన్నెల… ఇది నా కథ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ తో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది ప్రేక్షకులకు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని.. సినిమాకు ప్రధాన హైలైట్ గా చివరి ముపై నిముషాలు ఉంటుందని అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెటిస్తాయని.. సినిమా అంతా ఒకెత్తయితే.. సినిమా చివరిలో సాయి పల్లవి నటన మరో ఎత్తు అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.