Kiraak RP: కిరాక్ ఆర్పీ చేపల పులుసు షాపుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి.. ఇదీ జరిగింది

|

Jun 12, 2024 | 3:11 PM

కిరాక్ ఆర్పీ చేపల పులుసు హోటల్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నిజమెంత?.. ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్‌పై దాడి జరిగిందా? అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం పదండి...

Kiraak RP: కిరాక్ ఆర్పీ చేపల పులుసు షాపుపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి.. ఇదీ జరిగింది
Kiraak RP Store
Follow us on

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇంకా పొలిటికల్ వేడి మాత్రం తగ్గలేదు. ప్రధాన పార్టీల మధ్య సోషల్ మీడియాలో వేదికగా వార్ కొనసాగుతోంది. ప్రజంట్ జబర్దస్త్ ఫేమ్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫౌండర్ కిరాక్ ఆర్పీకి, అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ చేపల పులుసు ఔట్‌లెట్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ సర్కులేట్ అవుతోంది. నిజంగానే ఈ దాడి జరిగిందా..? లేదంటే తప్పుడు ప్రచారమా తెలుసుకుందాం పదండి.

సోషల్ మీడియాలో 45 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కిర్రాక్ ఆర్పీ హోటల్‌పై దాడి చేశారని తెలుగులో ఈ వీడియోను X ఫ్లాట్‌ఫామ్‌లో కొందరు షేర్ చేశారు. ఆర్పీ జబర్దస్త్ టీవీ షో ద్వారా పాపులర్ అయ్యారు.  ఎలక్షన్‌కు ముందు ఆయన టీడీపీలో చేరి యాక్టివ్‌గా పనిచేశారు.  టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున గట్టిగా ప్రచారం చేశారు. రోజా సహా వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అయితే ఎన్నికల సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..  నంద్యాల వైసీపీ అభ్యర్థి  శిల్పా రవిచంద్రారెడ్డికి బహిరంగంగా మద్దతు తెలిపారు. ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ.. ప్రచారం నిర్వహించారు. దీంతో ఆర్పీ అల్లు అర్జున్‌పై విమర్శలు చేశాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ఆయన హోటల్‌పై దాడి చేశారని ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోను దిగువన చూడొచ్చు.

ఈ వీడియో నిజమేనా?

వాస్తవానికి ఈ వీడియోకు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఎలాంటి సబంధం లేదు.  ఓ హోటల్‌లో కస్టమర్లకు.. అక్కడి సిబ్బందికి మధ్య జరిగిన గొడవగా తేలింది. 2024 జనవరి 1న హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను ఆర్పీ హోటల్‌పై అల్లు అర్జున్ దాడిగా కొందరు ప్రచారం చేస్తున్నారు. సో.. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం.