
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా సలార్. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొడుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇప్పుడు రూ.500 కోట్లకు చేరువలో ఉంది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. అటు ఈ సినిమాలోని పాటలకు సైతం మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహంపై ఎమోషన్స్ తో కూడిన పాటను కాసేపటి క్రితం విడుదల చేశారు. ‘వినరా.. ఈ పగలు.. వైరం మధ్యన త్యాగంరా, వినరా రగిలే మంటల మధ్యన మంచేరా, వినరా మరిగే గరళం మధ్యన జీవం రా’ అంటూ సాగే ఈ పాట మనసును తాకుతుంది. ప్రభాస్, పృథ్వీ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ సాంగ్ సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులకు పట్టుకుంటుంది.
The soulful #Vinaraa (Telugu), #Geleya (Kannada), #Yaraa (Hindi), #Arivaai (Tamil), #Varamaay (Malayalam) video song out now 🎵
▶️ https://t.co/JNjG0xNWBh#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/Eil2p1HWcb
— Hombale Films (@hombalefilms) December 26, 2023
సలార్ సినిమా.. హీరో ప్రభాస్, అతని స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు ఈ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఎపిసోడ్ తోనే ఈ కథ మొదలవుతుంది. ఇద్దరు స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అనేది సలార్ కథ. ఈ భారీ మాస్ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు కేవలం థియేటర్లలో చూసిన వినరా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో చూసేయ్యోచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.