Actress Simran: హీరోయిన్ సిమ్రాన్ కొడుకులను చూశారా ?.. బాలీవుడ్ హీరోల్లా కనిపిస్తున్నారు.. ఫోటోస్ వైరల్..

2000లలో తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అభిమానుల కలల సుందరి. ముంబైలో సెటిల్ అయిన పంజాబీ కుటుంబంలో జన్మించింది. నటిగానే కాకుండా నిర్మాత, నృత్యకారిణి, గాయనిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సిమ్రాన్. 1999లో స్టార్ట్ చేసిన సినీ ప్రయాణం 2004 వరకు సాగింది. టాలీవుడ్ డైరెక్టర్ శరత్.. అబ్బాయిగారి పెళ్లి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత రాకుమారుడు, యువరాజు, ప్రేమతో రా.. నువ్వు వస్తావని, బావ నచ్చాడు, డాడి, కలిసుందాం రా, సమరసింహా రెడ్డి చిత్రాల్లో నటించింది.

Actress Simran: హీరోయిన్ సిమ్రాన్ కొడుకులను చూశారా ?.. బాలీవుడ్ హీరోల్లా కనిపిస్తున్నారు.. ఫోటోస్ వైరల్..
Actress Simran
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2023 | 12:22 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ సిమ్రాన్. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోయింది.  2000లలో తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అభిమానుల కలల సుందరి. ముంబైలో సెటిల్ అయిన పంజాబీ కుటుంబంలో జన్మించింది. నటిగానే కాకుండా నిర్మాత, నృత్యకారిణి, గాయనిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సిమ్రాన్. 1999లో స్టార్ట్ చేసిన సినీ ప్రయాణం 2004 వరకు సాగింది. టాలీవుడ్ డైరెక్టర్ శరత్.. అబ్బాయిగారి పెళ్లి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత రాకుమారుడు, యువరాజు, ప్రేమతో రా.. నువ్వు వస్తావని, బావ నచ్చాడు, డాడి, కలిసుందాం రా, సమరసింహా రెడ్డి చిత్రాల్లో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది సిమ్రాన్.

అప్పట్లో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునేవారు అభిమానులు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రాన్ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. సీమరాజా, పెట్ట, రాకెట్రీ చిత్రాల్లో నటించింది. చేతి నిండా సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త దీపక్ భాగాను వివాహం చేసుకుంది. వీరికి ఆదిఫ్, అదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే సిమ్రాన్ కుటుంబంలో సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ ఉండదు. అలాగే ఏ సినీ ఈవెంట్లలోనూ కనిపించదు. తాజాగా క్రిస్మస్ పండగ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది సిమ్రాన్. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

సిమ్రాన్ కొడుకులిద్దరూ బాలీవుడ్ స్టార్ హీరోల్లా కనిపిస్తున్నారని.. ఇప్పటికే సినిమాల్లో నటించినట్లుగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎప్పుడూ నెట్టింట సైలెంట్ గా ఉండే సిమ్రాన్ చాలా కాలం తర్వాత తన కుమారులిద్దరూ కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. పంజాబీ కుటుంబానికి చెందిన సిమ్రాన్ కుమారులు సౌత్ ఇండియన్ ఫేషియల్ స్ట్రక్చర్ కలిగి ఉన్నారని అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.