Vijayashanti: సినీ ప్రముఖులతో సీఎం భేటీ.. రాములమ్మ రియాక్షన్ ఇదే

|

Dec 26, 2024 | 9:19 AM

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ...ఈ భేటీలో పాల్గొంటున్నారు. ఇక టాలీవుడ్‌ టీమ్‌కి కెప్టెన్‌...తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు. దిల్‌రాజు టీమ్‌లో బడా హీరోలు చిరంజీవి, వెంకటేష్ ఉన్నారు.

Vijayashanti: సినీ ప్రముఖులతో సీఎం భేటీ.. రాములమ్మ రియాక్షన్ ఇదే
Revanth Reddy, Vijayashanth
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలవనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ సర్కార్‌కి, టాలీవుడ్‌కి మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు దానిని మరింత పెద్దవి చేశాయి. సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తామని, అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఖబడ్దార్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇకపై సినీ ఇండస్ట్రీకి స్పెషల్‌ ప్రివిలేజెస్‌ ఉండవని చెప్పారు. స్పెషల్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు లాంటివి ఉండబోవని పరోక్షంగా తేల్చేశారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు.

ఇది కూడా చదవండి : కామన్ మ్యాన్‌లా స్కూటీపై తిరుగుతున్న ఈ సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫెమస్

సినీ పెద్దలతో పాటు హీరోలు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. వెంకటేష్, నితిన్, కిరణ్ అబ్బవరం,వరుణ్ తేజ్ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా సీఎంతో సినీ ప్రముఖుల భేటీ పై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటి. బీజేపీ మెంబర్ విజయశాంతి కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఇలా రాసుకొచ్చారు.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! స్టార్ హీరోయిన్స్ బీట్ చేసేలా అజిత్ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

“తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రిగార్లను గురువారం నాడు కలుస్తున్న సినిమా పరిశ్రమకు, ప్రభుత్వానికి సమగ్రమైన విశ్లేషణాత్మక చర్చలు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రిగారు విస్పష్టంగా ఇకపై ఉండబోవన్న టికెట్ రేట్ల పెంపు, సంక్రాంతి స్పెషల్ షోల అనుమతిపై మాత్రమే కాక, తెలంగాణ సినిమా, సంస్కృతి, ఆచార విధానాల ఉద్దీపన, చిన్న స్థాయి కళాకారులు, సాంకేతిక నిపుణులు, వారి ఉద్యోగ, నివాస భద్రతలు, జీవన ఆధారాలు, ప్రభుత్వ హామీలు, చిన్న మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాల విడుదలకు థియేటర్ల కేటాయింపు, పరిరక్షణ అన్నిటిపైనా సమగ్రమైన చర్చ, ప్రకటన కూడా ఎల్తదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.. సర్వత్రా ఈ చర్చల నేపథ్యంల.. సీఎం రేవంత్ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తప్పక నిర్ణయాత్మకంగా ఉంటదని విశ్వసిద్దాం” అని విజయశాంతి అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.