AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Naresh: నరేష్‌కు తల్లి విజయనిర్మల నుంచే కొన్ని కోట్లు విలువజేసే ఆస్తులు.. చెన్నై, హైదరాబాద్‌లో ఆస్తుల విలువ తెలిస్తే షాక్..

నరేష్ నాల్గో పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా పవిత్ర మీడియా ముందుకొచ్చి.. తమ ప్రేమకు మద్దతు ఇవ్వమని కోరడంతో.. నరేష్ ఆస్తులకు సంబంధించిన వార్తలు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్నాయి. నరేష్ ఆస్తులు విలువ, ప్రాపర్టీస్.. హాట్ టాపిక్ గా మారింది.

Actor Naresh: నరేష్‌కు తల్లి విజయనిర్మల నుంచే కొన్ని కోట్లు విలువజేసే ఆస్తులు.. చెన్నై, హైదరాబాద్‌లో ఆస్తుల విలువ తెలిస్తే షాక్..
Naresh Properties 1
Surya Kala
| Edited By: |

Updated on: Jul 07, 2022 | 4:51 PM

Share

Actor Naresh: ప్రస్తుతం ఎక్కడ చూసినా సీనియర్ నటుడు నరేష్ పెళ్లి గురించి వార్తలే విపిస్తున్నాయి. మూడో భార్య రమ్య రఘుపతితో గత ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్న నరేష్.. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే.. సహ క్యారెక్టర్ ఆర్టిస్టు.. పవిత్ర లోకేష్ తో సహజీవనం, పెళ్లి వార్తలు టాలీవుడ్ తో పాటు కన్నడ మీడియాని కూడా కుదిపేస్తున్నాయి. ఏకంగా మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్ర ఉన్నప్పుడు.. రమ్య రెడ్ హ్యాండ్ గా పట్టుకుని రచ్చ రచ్చ చేసింది.. ఏకంగా పవిత్రను చెప్పుతో కొట్టే వరకూ వెళ్ళింది. ఈ నేపథ్యంలో నరేష్ నాల్గో పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా పవిత్ర మీడియా ముందుకొచ్చి.. తమ ప్రేమకు మద్దతు ఇవ్వమని కోరడంతో.. నరేష్ ఆస్తులకు సంబంధించిన వార్తలు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్నాయి. నరేష్ ఆస్తులు విలువ, ప్రాపర్టీస్.. హాట్ టాపిక్ గా మారింది.

సీనియర్ నరేష్ .. అలనాటి మేటి నటి.. దర్శకురాలు , నిర్మాత విజయనిర్మల ఒక్కగానొక్క కొడుకు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. సూపర్ స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత.. నరేష్.. కృష్ణ దగ్గరే పెరిగాడు. ఇక విజయ నిర్మల ఆస్తి మొత్తానికి నరేష్ వారసుడు. బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టిన నరేష్.. హీరోగా కెరియర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో పలు సినిమాల్లో నటించాడు. అప్పట్లో పారితోషకం కూడా బాగానే తీసుకునేవాడనే టాక్..

నరేష్ దాదాపు 40ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నరేష్ ఆస్తులు సుమారుగా రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. విజయనిర్మల సంపాదించిన గచ్చిబౌలీలోని విప్రో సర్కిల్ దగ్గర విప్రో వెనుక వేలకోట్లు విలువచేసే 5 ఎకరాల ఫాం హౌస్ తోబాటు, మొయినాబాద్, శంకరపల్లి దగ్గరలోని ఖరీదైన 30 ఎకరాల ఫాం హౌస్ లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
Naresh Properties

Naresh Properties

ఇక చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలలో ఫ్లాట్లు, ఫార్మ్ హౌస్ లు, ఖరీదైన ఇల్లు కూడా ఉన్నాయి. నగలూ, డబ్బూకూడా భారీగానే ఉందట.  క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న నరేష్.. ఒకసినిమాకు 40 నుంచి రూ.50 లక్షల వరకు  రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇక ఖరీదైన నాలుగు కాస్ట్లీ కార్లు ఎప్పుడూ కూడా ఆయన ఇంటి దగ్గరే ఉంటాయి. ఖరీదైన స్పోర్ట్స్ కారుతో పాటు ఏ హీరోలకి కూడా లేని అత్యంత ఖరీదైన 5 కోట్ల రూపాయల విలువచేసే క్యారవ్యాన్ కూడా నరేష్ సొంతం. ఇందులో అన్ని వసతులు కూడా ఉండడం గమనార్హం.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..