Naga Chaitanya: లాల్ సింగ్ చడ్డాలో చై కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారట..!

|

Aug 13, 2022 | 5:07 PM

అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత అమీర్ ఖాన్ నుంచి వచ్చిన ఈసినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Naga Chaitanya: లాల్ సింగ్ చడ్డాలో చై కంటే ముందు ఆ స్టార్ హీరోను అనుకున్నారట..!
Naga Chaitanya
Follow us on

అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా(lal singh chaddha).. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత అమీర్ ఖాన్ నుంచి వచ్చిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేశారు అమీర్. ఇక ఈ సినిమాను తెలుగు మెగాస్టార్ చిరంజీవి సమర్పించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో నాగచైతన్య బోడి బాలరాజు పాత్రలో నటించి మెప్పించారు. ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే నాగచైతన్య నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు నాగచైతన్య నటనను ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ముందుగా నాగచైతన్య పాత్రకు ఎవరిని అనుకున్నారో తెలుసా..?

స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని బాలరాజు పాత్ర కోసం అనుకున్నారట. అమీర్ ఖాన్ ఇందుకోసం సేతుపతిని సంప్రదించారంట కూడా.. అయితే విజయ్ సేతుపతి కూడా ఓకే చెప్పేశారట. విజయ్ సేతుపతి చాలా మంచి స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే మెగాస్టార్ సైరా సినిమాతో పాటు . ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి బిజీగా ఉండటంతో ఈ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయ్యిందట. అదే విజయ్ సేతుపతి ఈ పాత్ర చేసిఉంటే ఆయన తప్పకుండా తనదైన నటనతో ఆకట్టుకునేవారు అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇక నాగ చైతన్య కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. తన నటనలో చాలా మార్పులు వచ్చాయి. చైతూ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి