Vijay Sethupathi: విలక్షణ నటనతో విపరీతమైన సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. తమిళ్ ,తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్న సేతుపతి కేవలం హీరోగానే కాదు విలన్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నాడు. ‘పిజ్జా’ ‘పేట’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సేతుపతి.. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో తళుక్కున మెరిసాడు. ఆతర్వాత ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రాయనం అనే పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. విజయ్ తో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి హీరోగా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ సేతుపతితో సినిమా చేసే అవకాశం ఉందని టాక్. మైత్రీ వారు తాజాగా విజయ్ సేతుపతి దగ్గరకు ఓ కథ తీసుకువెళ్లారట. మీడియం బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి మైత్రీ వారు ఫిక్స్ అయ్యారట. దీని కోసం సేతుపతికి పారితోషకం తోపాటుగా సినిమాలో వాటా కూడా ఉండనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :