క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్(Liger)గా గర్జించడానికి రెడీ అవుతున్నారు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు లైగర్ టీమ్.. ఇప్పటికే పలు నగరాల్లో ప్రయతిస్తు సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ సినిమాలో విజయ్ కు తల్లిగా కీలక పాత్రలో నటించారు. అలాగే లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ ఈ మూవీలో మరో కీలక పాత్రలో నటించారు.
ఇప్పటికే ప్రమోషన్స్ తో దుమ్మురేపుతోన్న లైగర్ టీమ్ కు అన్ని ప్రాంతాలనుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ అమ్మ ఈ సినిమా కోసం ప్రత్యేక పూజలు చేయించారు. సినిమా మంచి విజయం కావాలని పురోహితులను పిలిపించి హైదరాబాద్ లోని తమ నివాసంలో విజయ్, హీరోయిన్ అనన్య పాండేతో ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబందించిన ఫోటోలను అనన్య పాండే తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాక్సింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని ధీమాగా ఉన్నారు చిత్రయూనిట్. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు.. అనన్య టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం కానున్నారు. మరి ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..