Vijay Deverakonda : రణబాలిగా విజయ్ దేవరకొండ.. గూస్ బంప్స్ తెప్పించేలా గ్లింప్స్.. అదిరిపోయింది..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన విజయ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రణబాలి సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా విషయాలు ఏంటో తెలుసుకుందామా.

Vijay Deverakonda : రణబాలిగా విజయ్ దేవరకొండ.. గూస్ బంప్స్ తెప్పించేలా గ్లింప్స్.. అదిరిపోయింది..
Ranabaali Glimpse

Updated on: Jan 26, 2026 | 8:43 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలతో అలరించారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్, స్టైల్ మేనరిజంకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఫ్యాన్స్ విజయ్ దేవరకొండకు హిట్టిచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా రెండు సినిమాలతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రణబాలి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్నాళ్లు వీడీ 14 వర్కింగ్ టైటిల్ తో రూపొందించగా.. ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ షేర్ చేశారు మేకర్స్.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

ఈ సినిమాకు రణబాలి పేరును ఫిక్స్ చేశారు. టైటిల్ రివీల్ చేస్తూ ఓ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. 1878లో జరిగిన కథను ఇందులో చూపించనున్నారు. బ్రిటిష్ వారు భారతీయులను ఎంతగా చిత్రహింసలు పెట్టారు.. కనీసం భోజనం లేకుండా ఎలా దోచుకున్నారు అనేది ఇందులో చూపించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన చీకటి రహస్యాలను.. చరిత్రలో లేని రహస్యాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రణబాలిగా విజయ్.. జయమ్మగా రష్మిక మందన్నా కనిపించనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

ఇప్పుడు గ్లింప్స్ లో చివరగా గుర్రంపై స్వారీ చేస్తూ ఓ బ్రిటీష్ అధికారిని లాక్కుంటూ విజయ్ రైలు పట్టాలపై నుంచి విజయ్ ఎంట్రీ ఇచ్చిన తీరు మాత్రం వేరేలెవల్. మొత్తానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటవిశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..