Vijay Devarakonda: నిర్మాతగానూ రాణిస్తున్న రౌడీ.. మరోసినిమాకు ప్రొడ్యూసర్ గా విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళిచూపులు సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.

Vijay Devarakonda: నిర్మాతగానూ రాణిస్తున్న రౌడీ.. మరోసినిమాకు ప్రొడ్యూసర్ గా విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda

Updated on: May 31, 2021 | 10:57 PM

Vijay Devarakonda: టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళిచూపులు సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు విజయ్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా  చేసాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు హీరోగా చేసిన విజయ్.. నిర్మాతగాను మారాడు. తన బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాను నిర్మించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే మరో సినిమాను నిర్మించడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అంతా నూతన నటీనటులే కనిపిస్తారట. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas: యంగ్ రెబల్ స్టార్ కోసం మరో బాలీవుడ్ డైరెక్టర్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో ప్రభాస్ పాత్ర అదేనా..

Lucifer Movie: మెగాస్టార్ ‘లూసిఫర్’ మూవీ అప్‏డేట్.. పోస్టర్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అసలు విషయం ఎంటంటే..

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..