Kingdom Movie: అడ్వాన్స్‌ బుకింగ్‌లో కింగ్‌డమ్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయంటే?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ కు ముందే కింగ్ డమ్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.

Kingdom Movie: అడ్వాన్స్‌ బుకింగ్‌లో కింగ్‌డమ్ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయంటే?
Vijay Devarakonda Kingdom Movie

Updated on: Jul 29, 2025 | 9:28 PM

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న కింగ్ డమ్ సినిమా గురువారం (జులై 31) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. మన దేశంతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయిలో టికెట్లు సేల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత కింగ్ డమ్ టికెట్ల విక్రయాలు అమాంతం పెరిగాయి. అలా అడ్వాన్స్ బుకింగ్ లో ఇప్పటికే లక్ష కు పైగా టికెట్లు సేల్ అయ్యాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్ లో కూడా భారీగానే టికెట్లు అమ్ముడు పోతున్నాయి. రిలీజ్ కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో బుధవారం (జులై 30) అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణలు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు ఓవర్సీస్ లో కింగ్ డమ్ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో అక్కడ షోలు పెంచే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వినికిడి. సినిమా ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కింగ్ డమ్ పై పాజిటివ్ బజ్ బాగా పెరిగిపోయింది. సినిమాలోని విజువల్స్, విజయ్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అంశాలు అద్దిరిపోవడంతో విజయ్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక అనిరుధ్ మ్యూజిక్ తోడవడంతో ఇప్పుడు కింగ్ డమ్ పై భారీ హైప్ ఉంది.

ఇవి కూడా చదవండి

లక్షకు పైగా టికెట్ల సేల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి