Vijay Devarakonda: మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులకు ఆ విధంగా సాయం చేసి..

యంగ్ అండ్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అభిమానుల కష్ట సుఖాల్లో తోడుంటాను

Vijay Devarakonda: మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులకు ఆ విధంగా సాయం చేసి..
Vijay Devarakonda

Updated on: Jan 08, 2022 | 7:08 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అభిమానుల కష్ట సుఖాల్లో తోడుంటాను అని కెరీర్ ఆరంభంలో చెప్పిన మాటకు విజయ్ కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవరశాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చాయి. వాటిలో నుంచి 100 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున అందించనున్నారు.

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “మై లవ్స్ దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరును చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది” అని ట్వీట్ లో పేర్కొన్నారు. తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు ఇస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ ఏడాది కూడా ఆయన నగదు రూపంలో బహుమతులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 100 మందికి 10 లక్షల రూపాయలు బహుమతిగా పంచుతున్నారు.

ప్రస్తుతం విజయ్..మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యాటూ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్డ్స్ మార్షల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో దర్మ కనెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ల పై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..