రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda ) యూత్‌లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ క్రేజ్ మరింత స్పెషల్. గర్స్ దిల్ క్రష్ విజయ్ అని చెప్పడంలో సందేహం లేదు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రెటీస్ సైతం దేవరకొండ అభిమానులుగా మారిపోయారు. విజయ్‌తో డేట్‌కు వెళ్లాలని ఉందని బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఓపెన్ కామెంట్స్ చేయగా.. జాన్వీ కపూర్ కూడా విజయ్ అంటే ఇష్టమంటూ మనసులోని మాటలను బయటపెట్టేసింది. ఇక ప్రస్తుతం లైగర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు విజయ్. బాలీవుడ్ బ్యూటీ అనన్యతోపాటు లైగర్ చిత్రయూనిట్‌తో ముంబై వీధుల్లో సందడి చేస్తున్నాడు. తాజాగా ముంబైలోని ఒక మాల్లో లైగర్ ప్రమోషన్స్ చేశారు. అక్కడకు భారీ సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు.
అయితే మాల్ సెంటర్లోకి విజయ్ రాగానే వి లవ్ విజయ్ అంటూ నినదాలు చేశారు ఫ్యాన్స్. ముఖ్యంగా అమ్మాయిలు విజయ్ రాగానే.. వేదిక వద్దకు దూసుకువచ్చారు. హీరో స్టేజ్ పై అడుగుపెట్టగానే కొందరు అమ్మాయిలు ఆనందంతో సృహతప్పి పడిపోగా.. మరికొందరు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అక్కడున్న నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. విజయ్ పోస్టర్స్, స్కెచ్ లతో విజయ్ వి లవ్ యూ అంటూ పాటలు పాడుతూ సందడి చేశారు. అంతేకాకుండా.. భారీ సంఖ్యలో అమ్మాయిలు వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. అభిమానులను అదుపు చేసేందుకు బారికేడ్లను అమర్చినప్పటికీ వాటిని నెట్టుకుంటూ స్టేజ్ వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి శ్రుతిమించడంతో విజయ్, అనన్య మధ్యలోనే మాల్ నుంచి వెనుదిరిగారు.
Your love has touched me ❤️
Hope you all are safe and back home. Wish I could have been there with you all so much longer.Thinking about you all as I go to bed.
Goodnight Mumbai ?❤️#Liger— Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.