అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జీవితాంతం ఆ విషాదం వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు కోలీవుడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని- ఫాతిమా దంపతులు. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ సెప్టెంబర్ 20న ఆత్మహత్య చేసుకుంది. మానసిక కుంగుబాటుతో బాధపడుతోన్న మీరా చెన్నైలోని తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిం తన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. అప్పటివరకు అల్లారు ముద్దుగా తమ ముందు తిరిగిన బిడ్డ విగత జీవిగా పడి ఉండడం చూసిన విజయ్ ఆంటోని దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ వారు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కూతురును తల్చుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా మీరాను గుర్తు చేసుకుని ఎమోషనలైంది విజయ్ సతీమణి ఫాతిమా. కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫాతిమా ‘ ‘మీరా బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది జీర్నించుకోలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఆశగా ఎదురుచూస్తోంది తల్లీ’
‘ నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా. నాకు తెలిసి ఈ ప్రపంచం నీ కోసం కాదేమో. ఈ పుట్టుక, చావుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ ఆవేదన, బాధ నాకు తప్పదమ్మా. అక్కడ బాగా తిని రెస్ట్ తీసుకో తల్లీ. లారా( మీరా ఆంటోని సిస్టర్) కూడా నిన్ను చాలా మిస్ అవుతోంది..’ అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది విజయ్ సతీమణి. ప్రస్తుతం ఫాతిమా ఆంటోని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘బాధపడకండి మేడమ్’, ‘ఈ నష్టాన్ని భరించే శక్తిని మీకు, మీ కుటుంబానికి అందించాలి’, ధైర్యంగా ఉండండి మేడమ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC
— Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.