Vignesh Shivan : నా బంగారం.. ఇది నీతో కలిసి నా 8వ పుట్టినరోజు.. నయన్ భర్త విఘ్నేష్‌ ఆసక్తికర పోస్ట్

|

Sep 23, 2022 | 12:20 PM

లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ అందాల భామ .

Vignesh Shivan : నా బంగారం.. ఇది నీతో కలిసి నా 8వ పుట్టినరోజు.. నయన్ భర్త విఘ్నేష్‌ ఆసక్తికర పోస్ట్
Nayanthara
Follow us on

లేడీ సూపర్ స్టార్ నయన తార(Nayanthara) ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ గా సౌత్ లో తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ అందాల భామ . స్టార్ హీరోల సరసన సినిమాలు చేయడమే కాకుండా ఆ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది ఈ చిన్నది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న నయన్ దర్శకుడు విఘ్నేష్‌ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  నయన తార, విఘ్నేష్‌ ఎన్నో ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేశారు. ఇక వివాహం జరిగిన తర్వాత ఈ జంట ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెంటనే రెక్కలు కట్టుకొని విదేశాల్లో వాలిపోతున్నారు.

విఘ్నేష్‌ పుట్టిన రోజు ఈ సందర్భంగా నయనతార తన జీవితంలో మరిచిపోలేని మరపురాని విధంగా జన్మదిన వేడుకలను నిర్వహించింది. దుబాయ్‌ లో విహరిస్తోంది ఈ జంట. తాజాగా విఘ్నేష్‌  పుటిన రోజును చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ఇందుకు సంబంధించి కేక్ కట్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్‌. నీతో కలిసి నేను చేసుకుంటున్న 8వ పుట్టిన రోజు అంటూ రాసుకొచ్చారు విఘ్నేష్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా ముందు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ వేడుకల్లో విఘ్నేష్‌ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.