Vidaamuyarchi Twitter Review: విడాముయార్చి మూవీ ట్విట్టర్ రివ్యూ.. అజిత్ సినిమా ఎలా ఉందంటే..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. ఇక ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. తాజాగా అజిత్ ప్రధాన పాత్రలో నటించిన విదాముయార్చి సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. ఇప్పటికే మూవీ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Vidaamuyarchi Twitter Review: విడాముయార్చి మూవీ ట్విట్టర్ రివ్యూ.. అజిత్ సినిమా ఎలా ఉందంటే..
Vidaamuyarchi Movie Twitter

Updated on: Feb 06, 2025 | 8:36 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ విదాముయార్చి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఇందులో అజిత్ జోడిగా త్రిష కథానాయికగా నటించగా.. కన్నడ హీరో అర్జున్ విలన్ గా కనిపించారు. ఇక ఇందులో మరో హీరోయిన్ రెజీనా కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో పట్టుదల పేరుతో తీసుకువచ్చారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత అజిత్ సినిమా థియేటర్లలో విడుదలవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమాను చూసిన మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఎప్పటిలాగే అజిత్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో ఆసక్తికరంగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలోని ప్రతి సీన్ గూస్ బంప్స్ అని.. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ మరింత హైలెట్ అయ్యిందని అంటున్నారు. అజిత్, అర్జున్ మధ్య వచ్చే సీన్స్ వేరేలెవల్ అని.. వాళ్లిద్ధరి మధ్య ఉండే ఫైట్ సీన్స్ మాత్రం గూస్ బంప్స్ అంటున్నారు. అలాగే త్రిష, అజిత్ మధ్య లవ్ స్టోరీ బాగుందని.. అజిత్.. ఇలాంటి యాంగిల్ లో నటించడం బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన