నారప్ప నీదారెటప్పా… వెంకీ సినిమా పై వీడని కన్ఫ్యూజన్.. ఓటీటీనా..? లేక థియేటర్స్ లోనా .?

| Edited By: Rajeev Rayala

Jul 12, 2021 | 12:20 AM

విక్టరీ వెంకటేష్ త్వరలో నారప్పగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

నారప్ప నీదారెటప్పా... వెంకీ సినిమా పై వీడని కన్ఫ్యూజన్.. ఓటీటీనా..? లేక థియేటర్స్ లోనా .?
Narappa
Follow us on

victory venkatesh narappa : విక్టరీ వెంకటేష్ త్వరలో నారప్పగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకోసం వెంకటేష్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించానున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వెంకటేష్ మహేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం వహించ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేశారు. అయితే `నారప్ప` రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేక నేరుగా థియేటర్లో రిలీజ్ చేస్తారా?  అన్నది ఇప్పటికీ తెలియలేదు. ఇటీవలే  నారప్ప చిత్రం అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ రిలీజ్ అంటూ ప్రకటన విడుదలైంది. ఇదిలా ఉంటే తెలంగాణ ఫిలింఛాంబర్  ఇటీవల ఓ అల్టిమేటమ్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ లకు అమ్మవద్దని తెలంగాణ ఫిలింఛాంబర్ విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ వేచి చూడాలని నిర్మాతలను కోరింది.

ఈ సినిమా తొలి లిరికల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ తేదీ కూడా వారంలో అధికారికంగా బయటకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే నిర్మాత సురేష్ బాబు స్పందించాల్సిందే. చూడాలి త్వరలో ఈ సినిమా పై క్లారిటీ వస్తుందేమో.

మరిన్ని ఇక్కడ్ చదవండి :

Ajith Valimai: అజిత్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కార్తికేయ.. ఆకట్టుకుంటోన్న వలిమై ఫస్ట్‌లుక్‌. అభిమానులకు పండగే.

Nagarjuna OTT: ఓటీటీ వార్తలపై స్పందించిన నాగార్జున.. త్వరలోనే ఓ ప్రయోగత్మక సినిమాలో నటించనున్నట్లు.

Theaters Reopen: ఏదేమైనా ఈ నెలాఖరుకల్లా థియేటర్లు ఓపెన్‌ చేస్తాం.. స్పష్టం చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌..