Vettaiyan Twitter Review: రజనీ కాంత్ మరో హిట్ కొట్టారా? ‘వేట్టయన్’ ట్విట్టర్ రివ్యూ

|

Oct 10, 2024 | 8:08 AM

జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం 'వేట్టయన్'. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో భాగమయ్యారు. టీజర్‌, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

Vettaiyan Twitter Review: రజనీ కాంత్ మరో హిట్ కొట్టారా? వేట్టయన్ ట్విట్టర్ రివ్యూ
Vettaiyan
Follow us on

జైలర్, లాల్ సలామ్ తర్వాత సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన కొత్త చిత్రం ‘వేట్టయన్’. జై భీమ్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన జ్ఞాన్ వేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో భాగమయ్యారు. టీజర్‌, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ‘మనసిలాయో’ పాట, అందులో మంజూ వారియర్, రజనీల స్టెప్పులు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. ఇలా అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం (అక్టోబర్ 10) వెట్టయన్ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజయ్యింది. ఇప్పటికే చాలాచోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు, ఓవర్సీస్ షోలు పడ్డాయి. దీంతో రజనీ సినిమాను చూసిన పలువురు తమ అభిప్రాయలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. వేట్టయన్ సినిమాలో రజనీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయిందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే అమితాబ్, రానా, ఫాహద్ ఫాజిల్ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయంటున్నారు. ఇక మంజూ వారియర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని పొగుడుతున్నారు.

గత కొన్నేళ్లుగా తన పాటలతో సినిమాలకు హైప్ పెంచుతోన్న అనిరుధ్ ‘వేట్టయన్’ సినిమాకు బాణీలు అందించాడు. ఈ క్రమంలోనే తన బీజీఎమ్ తో అనిరుధ్ అదరగొట్టేశాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల రిలీజైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫస్ట్ హాఫ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథని సామాజిక సందేశంతో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా వేట్టయ్యన్ ను తెరకెక్కించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎక్కడ చూసినా రజనీకాంత్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ నే వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.