
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలును కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వేణు యేల్డండి దర్శకత్వం వహించారు. అప్పటివరకు జబర్దస్త్ కమెడియన్‌గా పరిచయమైన వేణుకు డైరెక్టర్‌గా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చి 3న చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన బలగం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. ఆ తర్వాత ఓటీటీ, టీవీల్లోనూ ఆదరణ దక్కించుకుంది. హృద్యమైన కథ, కథనాలతో కూడిన ఈ మూవీకి అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. కాగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా కావడంతో బలగం సినిమాకు ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన కానిస్టేబుల్ పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న అడిగారు. తాజాగా ఈరోజు (జులై 1) జరిగిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్షలోనూ ‘బలగం’ సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే..
A. దర్శకుడు: వేణు యెల్దండి
B. నిర్మాత దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి
C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
D. కొమరయ్య పాత్రను పోషించినది: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్ ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగారు
1. A, B, C మరియు D
2. A, B మరియు D మాత్రమే
3. A మరియు B మాత్రమే
4. A, B మరియు C మాత్రమే
బలగం సినిమాలో కొమరయ్య పాత్రలో నటించింది సుధాకర్ రెడ్డి అనే సీనియర్ నటులు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..