దీన స్థితిలో నటుడు..! పక్షవాతంబారిన పడిన టాలీవుడ్ కమెడియన్..

కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు నటుడు రామచంద్ర.. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.. ఆ మధ్య వరుసగా సినిమాలు చేసిన రామచంద్రకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

దీన స్థితిలో నటుడు..! పక్షవాతంబారిన పడిన టాలీవుడ్ కమెడియన్..
Tollywood News

Updated on: Aug 21, 2025 | 10:48 AM

సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం.. నిత్యం అవకాశాల కోసం ఎంతో మంది సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిండి తిప్పలు మానేసి అవకాశాల కోసం ఎదురుచూసేవారు చాలా మంది ఉన్నారు.అలాగే అవకాశాలు అందుకొని కాలం కలిసొచ్చి స్టార్స్ గా మారిన వారు కొందరున్నారు. అదేవిధంగా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోయినవారు చాలా మందే ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు.. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఆయన ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆర్ధికంగా బాగా చితికిపోయాడు ఆ నటుడు.. ఆయన పేరు రామచంద్ర. కమెడియన్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూయించాడు రామచంద్ర. ముఖ్యంగా సొంతం, వెంకీ సినిమాల్లో తన కామెడితో ఆకట్టుకున్నాడు. వెంకీ సినిమా రామచంద్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన పాత్ర సినిమా అంతా ఉంటుంది.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

కాగా రామచంద్ర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25ఏళ్లు అవుతుంది. కానీ ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఆనందం, వెంకీ, సొంతం వంటి హిట్ సినిమాల్లో నటించినా అనుకున్నంత గుర్తింపు తెచుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పక్షవాతంతో బాధపడుతున్నారు కమెడియన్ రామచంద్ర. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆయన మాట్లాడుతూ.. కాళ్లు చేతులు లాగుతున్నాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్ లో రెండు క్లాట్స్ ఉన్నాయని చెప్పారు. ఎడమ చేయి, ఎడమ కాలుకు పక్షవాతం వచ్చింది అని తెలిపారు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

అలాగే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నిన్ను చూడాలని సినిమాతో నేను మొదటి అవకాశం అందుకున్నా.. ఆతర్వాత వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి.. కెరీర్‌లో వచ్చిన బ్రేక్ తన జీవితాన్ని గందరగోళంలో పడేసిందని తెలిపాడు. కెరీర్ బిగినింగ్ లో అవకాశాలు ఈజీగా వచ్చాయి.. కానీ ఆతర్వాత రావడం కష్టంగా మారింది. రోడ్డు ప్రమాదం జరగడంతో మూడేళ్లు సినిమాకు దూరం అయ్యా.. దాంతో డబ్బులు అన్నీ అయిపోయాయి. ఆర్ధిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల పాలు అయ్యాను అని తెలిపాడు. చాలా అప్పులు చేశా.. చాలా వరకు తీర్చేశా.. కానీ ఇంకా ఉన్నాయి. అవకాశాలు రావడం లేదు. నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు.? ముఖం గుర్తులేదు అంటున్నారు. ఆ మాటలు చాలా భాదపెట్టాయి.. నేను ఎవరి సాయం కోసం ఎదురుచూడటం లేదు.. కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా అని తెలిపాడు రామచంద్ర.

ఇవి కూడా చదవండి

మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.