Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. వెంకీ మామ కెరీర్‌లోనే హైయ్యెస్ట్​

|

Jan 15, 2025 | 12:16 PM

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా మంగళవారం (జనవరి 14)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి రోజే రికార్డు కలెక్షన్లు వచ్చాయి.

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్.. వెంకీ మామ కెరీర్‌లోనే హైయ్యెస్ట్​
Sankranthiki Vasthunam movie
Follow us on

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ సంక్రాంతకి వస్తున్నాం సినిమాతో మన ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వెంకీ మామ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటి రోజే ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 45 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం స‌రికొత్త పోస్ట‌ర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘పండ‌గ‌కి వ‌చ్చారు.. పండ‌గ‌ని తెచ్చారు’ అంటూ ఆడియెన్స కు ధన్యవాదాలు తెలిపింది. కాగా విక్టరీ వెంక‌టేష్ కెరీర్‌లోనే తొలి రోజు అత్య‌ధిక వసూళ్ల‌ను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. దీంతో చిత్ర బృందమంతా సంతోషంలో మునిగి తేలుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా సంక్రాంతి సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటిరోజే రికార్డు కలెక్షన్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్‌లో తొలి రోజు సినిమా సుమారు 7 లక్షల డాలర్ల వసూళ్లు చేసింది. వెంకటేశ్ కెరీర్‌లో ఇంత భారీ ఓవర్సీస్ కలెక్షన్లు రాబట్టిన మొదటి సినిమా ఇదే అని చిత్ర బృందం ప్రకటించింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు హీరోయిన్లుగా న‌టించారు. అలాగే వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార, రఘుబాబు, నరేశ్, ప్రియదర్శి, మురళీ ధర్, పృథ్వీ రాజ్, పోసాని కృష్ణ మురళి తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

ఇవి కూడా చదవండి

వెంకీ మామ సినిమాకు మొదటి రోజే భారీ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.