
టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ప్రస్తుతం తమిళ మూవీ అసురన్ రీమేక్ ‘నారప్ప’ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. కథ డిమాండ్ చేయడంతో తమిళనాడులోని లొకేషన్లలో సుమారు 60 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాాయిదా పడింది. ప్రస్తుతం ప్రభుత్వాల నుంచి సడలింపులు రావడంతో… వెంకటేశ్ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం.
తాజా సమాచారం అప్డేట్స్ ప్రకారం నారప్ప షూటింగ్ అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం అవ్వనుందట. ఇప్పటికే ఈ చిత్రంలో వెంకీకి సంబంధించిన మేజర్ పార్టు షూట్ చేసేశారు. కాగా ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read :
పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే
గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !