Pawan Kalyan-Venkatesh: ‘పిఠాపురం ఎమ్మెల్యే గారూ’.. పవన్‌కు తనదైన స్టైల్‌లో విషెస్ చెప్పిన వెంకీ మామ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. పలువురు రాజకీయ, సినీ , క్రీడా ప్రముఖులు జనసేన అధిపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజగా పవన్ కల్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ స్పందించారు. 'పిఠాపురం ఎమ్మెల్యే గారు' ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

Pawan Kalyan-Venkatesh: పిఠాపురం ఎమ్మెల్యే గారూ.. పవన్‌కు తనదైన స్టైల్‌లో విషెస్ చెప్పిన వెంకీ మామ
Pawan Kalyan, Venkatesh,

Updated on: Jun 06, 2024 | 2:49 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. పలువురు రాజకీయ, సినీ , క్రీడా ప్రముఖులు జనసేన అధిపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజగా పవన్ కల్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ స్పందించారు. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారు’ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “ప్రియమైన పవన్ కల్యాణ్… చారిత్రక విజయం సాధించినందుకు అభినందనలు. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా. నువ్వు మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని, ఇకమీదట కూడా నీ కఠోర శ్రమతో, నీ శక్తితో, ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావంతో స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇకపై మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారూ’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు వెంకీ మామ.

పవన్ కల్యాణ్, వెంకటేశ్ ల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో ‘గోపాల గోపాల’ అనే చిత్రంలో కలిసి నటించారు. అలాగే పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాత వాసి సినిమాలోనూ ఓ క్యామియో రోల్ లో సందడి చేశారు వెంకటేశ్.

ఇవి కూడా చదవండి

వెంకటేశ్ ట్వీట్..

అక్కినేని నాగార్జున కూడా పవన్ విజయంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఘనవిజయం సాధించినందుకు గౌరవప్రదమైన PM నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు నాగ్. అంతకు ముందు చిరంజీవి, అల్లు అర్జున్ ,మహేశ్ బాబు, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, రవితేజ తో పాటు పలువరు స్టార్ నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు పవన్ కు అభినందనలు తెలిపారు.

నాగార్జున రియాక్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.