Jr NTR – Venkatesh: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ సరదా ముచ్చట్లు.. ఎంత బాగా కలిసిపోయారో.. వీడియో చూడండి

|

Nov 04, 2024 | 10:55 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. శివాని అనే అమ్మాయితో కలిసి తన జీవితం పంచుకోనున్నాడు. ఆదివారం (నవంబర్ 03) వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది.

Jr NTR – Venkatesh: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ సరదా ముచ్చట్లు.. ఎంత బాగా కలిసిపోయారో.. వీడియో చూడండి
Jr NTR, Venkatesh
Follow us on

ఎన్టీఆర్ బామ్మర్ది, టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్, శివానీల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆదివారం (నవంబర్ 03) హైదరాబాద్ లో జరిగిన ఈ నిశ్చితార్థం వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అలాగే శివానీకి దగ్గరి బంధువులైన విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాబోయ దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నార్నే నితిన్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఒక వీడియో సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. నెట్టింట బాగా వైరలవుతోన్న ఈ వీడియోలో ఈ వీడియోలో హీరో వెంకటేష్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో సరదాగా ఆడుకున్నాడు. ఎన్టీఆర్ తనయులను దగ్గరకు తీసుకొని ముచ్చట్లు చెప్పాడు వెంకటేష్. వీరి పక్కన ప్రముఖ నిర్మాత చినబాబు కూడా ఉన్నారు. దీనిని చూసిన సినీ అభిమానులు, ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్‏లతోపాటు హీరో కళ్యాణ్ రామ్, వెంకటేశ్, రానా దగ్గుబాటి, నిర్మాత చినబాబు తదితరులు సందడి చేశారు. 2023లో మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నార్నే నితిన్. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల ఆయ్ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్ సినిమాలో బిజీగా ఉంటున్నాడీ యంగ్ హీరో.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ కుమారులతో వెంకటేష్.. వీడియో ఇదిగో..

ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు .సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

నార్నే నితిన్ ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.