Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ 2 నుంచి మరో లిరికల్ సాంగ్.. ఏఆర్ రెహమాన్.. చంద్రబోస్ కాంబోలో వీర రాజవీర..

తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి వీర రాజవీర అంటూ సాగే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమాలో అరుణ్మునిగా నటించిన జయం రవి వీరత్వాన్ని కీర్తిస్తూ పాడే పాటగా ఈ పాటను ఆవిష్కరించారు.

Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ 2 నుంచి మరో లిరికల్ సాంగ్.. ఏఆర్ రెహమాన్.. చంద్రబోస్ కాంబోలో వీర రాజవీర..
Ps 2

Edited By: Rajitha Chanti

Updated on: Apr 09, 2023 | 2:28 PM

దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. గతంలో వచ్చిన పీఎస్ 1 చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్య రాయ్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకోగా.. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి వీర రాజవీర అంటూ సాగే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. సినిమాలో అరుణ్మునిగా నటించిన జయం రవి వీరత్వాన్ని కీర్తిస్తూ పాడే పాటగా ఈ పాటను ఆవిష్కరించారు.

రాజ్యంలోకి వచ్చిన అరుణ్మనికి స్వాగతం పలుకుతూ అతని ప్రేయసి శోభిత దూళిపాళ్ల నాట్యం చేస్తూ ఆయన కీర్తిని వర్ణిస్తున్నట్లుగా ఈ పాటను డిజైన్ చేశారు. శంకర్ మహదేవన్, చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆలపించారు. తాజాగా విడుదలైన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కళ్లారా చూద్దామా చోళ ఖడ్గ సంచారం సంహారం అంటూ సాంగే ఈ పాట.. ఆ తర్వాత అరుణ్మని వీరత్వాన్ని వర్ణిస్తూ అద్భుతమైన వర్ణనతో సాగింది. అంతేకాకుండా.. ఇందులో అరుణ్మని, శోభితా ప్రేమని కూడా తెలియజేశారు.

ప్రస్తుతంత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇక తాజాగా విడుదలైన వీర రాజవీర సాంగ్ కూడా అంతే అద్భుతంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.